మదురైలో జనవరి 31, ఫిబ్రవరి 1, 2 తేదీలలో జరిగిన జాతీయ స్కేటింగ్ పోటీలలో రాజంపేటకు చెందిన ఇద్దరు విద్యార్థులు గోల్డ్ మెడల్ సాధించారు. మేడూరి లక్ష్మీ స్నేహిత అండర్ -4 క్వాడ్ రిలే రేస్ 200 మీటర్ల లో గోల్డ్ మెడల్, సౌర్య సింహ వర్మ అండర్ -6 క్వాడ్ రిలే రేస్ 200 మీటర్ల రేస్ లో గోల్డ్ మెడల్ సాధించారని సోమవారం కోచ్ వినోద్ కుమార్ తెలిపారు. వీరు రాజంపేట లోని వీకే స్కేటింగ్ అకాడమీలో శిక్షణ పొందారు.