ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు వరం లాంటిదని రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ కుప్పాల వెంకటసుబ్బయ్య అన్నారు. సిద్ధవటం ఆకుల వీధికి చెందిన పోలిశెట్టి శ్రీనివాసులు ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. మెరుగైన చికిత్స కోసం సీఎం సహాయ నిధి పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. గురువారం ఆ పథకం కింద 3,70,800 రూపాయల చెక్కును అందజేశారు.