తాళ్లపాక చెన్నకేశవ స్వామి ఆలయానికి తాళ్లపాక గ్రామానికి చెందిన శ్రీనివాసరావు ఇత్తడి పూజా సామాగ్రిని వితరణగా అందజేసినట్లు ఆలయ ఇన్స్పెక్టర్ బాలాజీ గురువారం సాయంత్రం తెలిపారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ చెన్నకేశవ స్వామి ఆలయాలకు దాతలు సహకరిస్తే ఆలయాలు మరింత అభివృద్ధి చెందుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆలయానికి పూజా సామాగ్రిని వితరణగా అందజేసిన శ్రీనివాసరావు ను ప్రత్యేకంగా అభినందించారు.