రాజంపేట మండలం ఊటుకూరు సచివాలయం వద్ద కడప - చెన్నై జాతీయ రహదారిపై లారీ - ఐచర్ వాహనం ఢీకొన్న ఘటన శనివారం చోటుచేసుకుంది. ఐచర్ వాహనం ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. డ్రైవర్ ఐచర్ వాహనంలో ఇరుక్కుపోవడం, ప్రధాన రహదారిపై ప్రమాదం జరగడంతో కిలోమీటర్ల మేర వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. గ్రామ ప్రజలు డ్రైవర్లను వాహనం నుండి బయటకు తీశారు.