రాజంపేట మండలంలో చెరువులలో నీరు చేరి జలకళ అనిపిస్తుంటే రైతుల ముఖాలు ఆనందంతో కళకళలాడుతున్నాయి. శుక్రవారం మన్నూరు, ఎం. జి పురం, తాళ్లపాక చెరువులలో నీరు చేరుతుండడంతో రాజంపేట పార్లమెంటు టిడిపి అధ్యక్షులు జగన్మోహన్ రాజు ఆనందం వ్యక్తం చేస్తూ చెరువులను పరిశీలించారు. నీటి ప్రవాహాన్ని ప్రత్యక్షంగా వీక్షించి గంగమ్మకు జల హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.