రాజంపేట: రాష్ట్రంలో వైద్య విద్యను భ్రష్టు పట్టించింది జగన్

57చూసినవారు
రాజంపేట: రాష్ట్రంలో వైద్య విద్యను భ్రష్టు పట్టించింది జగన్
రాష్ట్రంలో వైద్య విద్యను మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భ్రష్టు పట్టించారని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతుగుంట రమేష్ నాయుడు అన్నారు. గురువారం రాజంపేటలో ఆయన మాట్లాడుతూ జగన్ వల్ల వైద్య విద్యార్థులు 2500 సీట్లు కోల్పోయారని అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని, ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో ఆదినారాయణ, రమణ, నాగరాజు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్