రాజంపేట, మన్నూరు పోలీస్ స్టేషన్ నూతన ఇన్స్పెక్టర్ గా భాద్యతలు చేపట్టిన కుళాయప్ప జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ను గురువారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శాంతి భద్రతలను కాపాడాలని, నేరాలను తగ్గించాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, సోషల్ మీడియాలో అప్రమత్తంగా ఉండేలా ప్రజలకు సూచించాలని, సిబ్బందితో సమర్థవంతంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు.