అన్నమయ్య జిల్లా రాజంపేట ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నందు ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఈ మెగా ఉద్యోగ మేళ ఈ నెల 20 వ తేదీ మంగళవారం నిర్వహిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు చమర్తి జగన్ మోహన్ రాజు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఉద్యోగమేళలో హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్, ముత్తూట్ ఫైనాన్స్, టాటా క్యాపిటల్, అపోలో ఫార్మసీ తదితర కంపనీలు పాల్గొంటున్నాయని తెలిపారు.