అడాప్ట్ ఏ విలేజ్ గ్లోబల్ ఫౌండేషన్ అమెరికా వారి ఆర్థిక సహకారంతో జనవరి 5వ తేదీన మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. రాజంపేట మండలం తాళ్లపాక రోడ్డులోని శాన్వి ఇంటర్నేషనల్ పాఠశాల ఆవరణలో మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు పాఠశాల చైర్మన్ శరత్ కుమార్ రాజు తెలిపారు. అన్ని రకాల వ్యాధులను పరిశీలించి, ఉచితంగా మందులు సరఫరా చేస్తామని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.