రాజంపేట: ముఖ్య నేతలతో మంత్రి మండిపల్లి సమావేశం

75చూసినవారు
రాజంపేట: ముఖ్య నేతలతో మంత్రి మండిపల్లి సమావేశం
రాజంపేట తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో బుధవారం రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతం, బూత్ స్థాయి సమన్వయం తదితర అంశాలపై నేతలతో సుదీర్ఘంగా చర్చించారు. సమావేశంలో స్థానిక పార్టీ నేతలు, కార్యకర్తలు, యువ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్