రాజంపేట: మున్సిపల్ కార్మికుల పిల్లలకు తల్లికి వందనం అమలుచేయాలి

52చూసినవారు
రాజంపేట: మున్సిపల్ కార్మికుల పిల్లలకు తల్లికి వందనం అమలుచేయాలి
అన్నమయ్య జిల్లాలో పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు తల్లికి వందనం పథకం అమలు చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు రవికుమార్ అన్నారు. దీంతో శనివారం రాజంపేట పురపాలక కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. కార్మికుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన వారే ఎక్కువ మంది ఉన్నారన్నారు. వారు చాలీచాలని జీతాలతో అలమటిస్తున్నారని, పిల్లలకు నాణ్యమైన విద్యను అందించలేక పోతున్నారని అన్నారు.

సంబంధిత పోస్ట్