ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ రైలు స్టాపేజ్ ని రాజంపేటలో బుధవారం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో రైల్వేకి మంచి రోజులు వచ్చాయని అన్నారు. అలాగనే గతంలో రైల్వే శాఖ నార్త్ ఇండియాకే పరిమితం అయ్యేది, కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చాక సౌత్ రీజియన్ పై కూడా దృష్టి పెట్టారన్నారు.