రాజంపేట పురపాలక సంఘం పరిధిలో జరుగుతున్న రీ సర్వే కొలతలు వల్ల పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని ప్రజలందరూ అపోహలు వీడి సర్వే కొలతలకు సహకరించాలని రాజంపేట మునిసిపల్ కమిషనర్ శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలియజేసారు. బుధవారం ఆయన తన మునిసిపల్ చాంబర్లో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సూచించిన మేరకు రాజంపేట పట్టణంలో ఉన్న 11473 ఇండ్ల (అసెస్మెంట్ల) రీ సర్వే చేపడుతున్నామన్నారు.