రాజంపేట: చౌక ధర దుకాణాల డీలర్ల నియామక ప్రక్రియ పూర్తి

62చూసినవారు
రాజంపేట: చౌక ధర దుకాణాల డీలర్ల నియామక ప్రక్రియ పూర్తి
రాజంపేట డివిజన్ లో ఖాళీగా ఉన్న, నూతన చౌక ధర దుకాణాల డీలర్ల నియామక ప్రక్రియ పూర్తయిందని శనివారం రాజంపేట సబ్ కలెక్టర్ నదియా దేవి ఒక ప్రకటనలో తెలిపారు. రాజంపేట డివిజన్ లో చౌక ధర దుకాణాల డీలర్ల ఎంపిక కోసం గతంలో నోటిఫికేషన్ ఇచ్చామని, ప్రభుత్వం నిర్ణయించిన నియమ నిబంధనల మేరకు ఎంపిక జరిగిందని ఆమె తెలిపారు. నూతనంగా ఎంపికైన డీలర్లకు నియామక పత్రాలను త్వరలో అందజేస్తామని ఆమె తెలిపారు.

సంబంధిత పోస్ట్