రాజంపేట పట్టణం బోయినపల్లిలో కొంతమందికి కోళ్ల ఫారాల కోసం కేటాయించిన స్థలాలపై వెంటనే సర్వే చేసి నివేదికను అందజేయాలని రాజంపేట సబ్ కలెక్టర్ వై కోమ్ నదియాదేవి తహసీల్దార్ పీరు మున్ని, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రాజ్యలక్ష్మి, ఆర్ఐ శేషం రాజు, మండల సర్వేయర్ భవానిలను ఆదేశించారు. మంగళవారం సబ్ కలెక్టర్ అధికారులతో కలిసి బోయినపల్లి గ్రామానికి చేరుకొని ఇసుకపల్లి రోడ్డులో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీలకు కేటాయించిన కోళ్ల ఫారాలను పరిశీలించారు.