ప్రతి గ్రామంలో జల కళతో ప్రజలు సుభిక్షంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అందుకే ఎక్కడా నీటి సమస్య లేకుండా చర్యలు చేపడుతున్నామని రాజంపేట పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు చమర్తి జగన్మోహన్ రాజు తెలియజేశారు. గురువారం రాజంపేట మండలం కొమ్మివారిపల్లి లో నీటి కోసం బోర్లకు ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. ముందుగా ఆయనకు గ్రామస్తులు ఆత్మీయ స్వాగతం పలుకుతూ శాలువాతో సత్కరించి గ్రామాలలో సమస్యలను గుర్తించి పరిష్కరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేశారు.