రాజంపేట పట్టణం బోయినపల్లిలోని అన్నమాచార్య యూనివర్సిటీలో ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్న అఖిల అనే విద్యార్థిని మృతి పట్ల నిజాలు బయటపెట్టాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. గురువారం అన్నమాచార్య యూనివర్సిటీ వద్ద వారు మాట్లాడుతూ అఖిల మృతి పట్ల అనేక అనుమానాలు ఉన్నాయని, నిజాలను బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.