రాజంపేట పట్టణం లోని నూనెవారిపల్లి ప్రధాన రహదారిలో మంగళవారం ఉదయం రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో నందలూరుకు చెందిన నాగేంద్ర, సునీల్, నూనెవారిపల్లికి చెందిన గంగిరెడ్డి గాయపడ్డారు. స్థానికులు గాయపడ్డ వాళ్ళని హుటాహుటిన రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరికి బలమైన గాయాలు తగలడంతో కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.