విద్యార్థులకు అనుగుణంగా పాఠశాలల పునర్ వ్యవస్థీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ విద్యాశాఖాధికారులను ఆదేశించారు. మంగళవారం రాజంపేట ఎంపీడీవో కార్యాలయంలో రాజంపేట, నందలూరు మండల ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు, టీచర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏ ఒక్క విద్యార్థీ నష్టపోకుండా వారికి ఉపయోగపడే విధంగా పాఠశాలల పునర్ వ్యవస్థీకరణ ప్రక్రియను చేపట్టాలన్నారు.