రాజంపేట టిడిపి కార్యాలయం నందు వీరబల్లి మండల ఎమ్మార్వో ఖాజాబీ రాజంపేట పార్లమెంట్ ఇన్చార్జి చమర్తి జగన్ మోహన్ రాజు ని శుక్రవారం మర్యాద పూర్వకంగా కలవడం జరిగినది. అనంతరం వీరబల్లి మండల సమస్యల గురించి చర్చించడం జరిగినది. ఈ సందర్భంగా చమర్తి మాట్లాడుతూ వీరబల్లి మండల ప్రజలకు అందుబాటులో ఉంటూ, రైతు సమస్యలను, ప్రజల సమస్యలను పరిష్కరించాలని ఎమ్మార్వో కి సూచించడం జరిగింది.