తోడబుట్టిన అన్న కుమార్తె వివాహానికి ఇంటికి వచ్చిన చెల్లెలు బ్యాగులోని బంగారం మాయమైన సంఘటన రాజంపేటలో ఆలస్యంగా మంగళవారం వెలుగు చూసింది. 343 గ్రాముల బంగారాన్ని పోగొట్టుకొని కంగు తిన్న చెల్లెలు చేసేదేమీ లేక రాజంపేట ఏఎస్పీ మనోజ్ రామ్నాథ్ హెగ్డేని ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. నాగమణి అనే మహిళ తిరుపతి నుంచి రాజంపేటకు వచ్చి తన వెంట తీసుకువచ్చిన 343 గ్రాముల బంగారం వధువు స్వగృహంలో ఉంచితే ఆ బంగారం మాయమైందని ఫిర్యాదులో తెలిపింది.