విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో అన్యాయంగా తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు రవికుమార్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు కార్యాలయ ఆవరణంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కార్మికులకు మద్దతుగా సోమవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో పని చేసినటువంటి కార్మికులను అన్యాయంగా తొలగించడం దుర్మార్గమన్నారు.