పదవి విరమణ అనేది ప్రతి ఒక్కరి ఉద్యోగంలో ఒక భాగమేనని ఒంటిమిట్ట మండల విద్యాశాఖ అధికారులు జి వెంకటసుబ్బయ్య, డి ప్రభాకర్ అన్నారు. ఒంటిమిట్ట మండల పరిధిలోని కుడమలూరు ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న సూరేపల్లి అంకయ్య పదవి విరమణ కార్యక్రమాన్ని ఒంటిమిట్ట ప్రాథమిక పాఠశాల లో శనివారం నిర్వహించారు. మండల పరిధిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు హాజరై ఉపాధ్యాయ వృత్తిలో ఆయన చేసిన సేవలను కొనియాడారు.