కాలువలలో ముందుకు కదలని మురుగు

78చూసినవారు
కాలువలలో ముందుకు కదలని మురుగు
రాజంపేట మున్సిపాలిటీలో డ్రైనేజీ వ్యవస్థ గత కొన్ని నెలలుగా అస్తవ్యస్తంగా తయారైందని శనివారం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. మురికి కాలువలలో ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయి అన్ని వార్డుల్లో డ్రైనేజీ కాలవలు కంపు కొడుతున్నాయన్నారు. కొన్ని నెలలుగా డ్రైనేజీ కాలువలలో పూడిక తీయకపోవడంతో మురుగునీరు ఎక్కడికక్కడ నిలిచిపోయి దుర్గంధం వెదజల్లుతోందన్నారు. అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలన్నారు

సంబంధిత పోస్ట్