సిద్ధవటం మండలంలోని లంకమల అభయారణ్యంలో వెలసిన నిత్య పూజ స్వామి కోనలో జరిగే శివరాత్రి మహోత్సవాలకు ఫిబ్రవరి 4న వేలం పాటలు నిర్వహిస్తున్నట్లు అధికారులు గతంలో ప్రకటించారు. మంగళవారం సిద్ధవటంలో వారు మాట్లాడుతూ వేలం పాటను తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగిందన్నారు. త్వరలోనే వేలంపాట ఎప్పుడు నిర్వహించేది తెలియజేస్తామని తెలిపారు.