వీరబల్లి అటవీ బీటు పరిధిలో ఆరుగురు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేయడంతో పాటు వారి నుంచి తొమ్మిది దుంగలు టాస్క్ ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆర్ఐ (ఆపరేషన్స్) సురేష్ కుమార్ రెడ్డికి చెందిన ఆర్ఎస్ఐ లింగాధర్ టీం వీరబల్లి ఎఫ్‌బిఓ అనిల్ కుమార్ తో కలిసి వీరబల్లి అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించినట్లు వారు వివరించారు. మంగళవారం స్మగ్లర్లను మీడియా ముందు ప్రవేశపెట్టారు.