రాజంపేట నియోజకవర్గంలో నీటి పారుదల సమస్యలను రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు దృష్టికి తీసుకు వెళ్లినట్లు రాజంపేట నియోజకవర్గం జనసేన నాయకులు కొట్టే శ్రీధర్ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర సచివాలయంలో మంత్రికి సమస్యలు విన్నవించానని, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి సమస్యలు విని సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు.