మండల కేంద్రమైన ఒంటిమిట్టలో వెలసిన సంజీవ రాయునికి టీటీడీ అధికారులు మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీటీడీ వారు స్వామివారికి పట్టు వస్త్రాలు, గజమాలలు సమర్పించారు. అర్చకులు స్వామివారిని సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక పూజల అనంతరం భక్తులను దర్శనార్థం అనుమతించారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.