రాజంపేట నియోజకవర్గంలో యదేచ్ఛగా ప్రభుత్వ భూములు ఆక్రమిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుని, ఇకపై భూ ఆక్రమణ జరగకుండా చూడాలని రాజంపేట నియోజకవర్గం టిడిపి బాధ్యులు సుగవాసి సుబ్రహ్మణ్యం కోరారు. శుక్రవారం రాజంపేట సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ నిధియా దేవికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల తహసిల్దార్ కార్యాలయంలో ప్రజల వినతులు వెంటనే పరిష్కరించేలా ఆదేశించాలని కోరారు.