సుండుపల్లె మండల పరిధిలోని ముడుంపాడు పంచాయతి ఆరోగ్యపురం ఎన్ జే ఆర్ కాలనీ లో వెలసిన వెంకటేశ్వర స్వామి ఆలయంలో వేంకటేశ్వర స్వామికి ఆలయ పూజారి అమ్రునాయక్ అభిషేక పూజలు చేశారు. శనివారం ఉదయం ఆలయాన్ని శుద్ది చేసి పంచామృతాలతో స్వామి వారి మూల విరాట్ కు అభిషేకం చేశారు. అనంతరం తులసి, పూల మాలలతో స్వామివారిని అలంకరించి పూజలు చేసి నైవేద్యం సమర్పించి హారతి ఇచ్చారు. మొక్కుబడిలో భాగంగా పలువురు తలనీలాలు సమర్పించుకున్నారు.