సుండుపల్లె: భక్తి శ్రద్ధలతో ఆంజనేయ స్వామికి పూజలు

59చూసినవారు
సుండుపల్లె: భక్తి శ్రద్ధలతో ఆంజనేయ స్వామికి పూజలు
సుండుపల్లె మండల పరిధిలోని గుండ్లపల్లె సమీపంలో వెలసిన శ్రీవరసిద్ది వీరాంజనేయ స్వామి తిరునాళ్ళ ఉత్సవాలలో భాగంగ శుక్రవారం నుంచి సోమవారం వరకు ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తారు. శుక్రవారం ఆలయ అర్చకులు సురేష్ శర్మ ఆలయంలో గణపతి పూజ చేసి స్వస్తి వాచనం నిర్వహించారు. అనంతరం రక్షా బంధనం, అఖండ దీపారాధన, కలశాలు స్థాపించి పూజలు చేశారు. ఆంజనేయ స్వామి ని శుద్ధి చేసి ప్రత్యేక అర్చనలు చేశారు.

సంబంధిత పోస్ట్