సుండుపల్లి మండల పరిధిలోని కస్తూరిభా గాంధీ గురుకుల పాఠశాల ఎంఎన్ఆర్ జూనియర్ కళాశాల, జిల్లా పరిషత్ ఉర్దూ ఉన్నత పాఠశాల ల యందు బాల్య వివాహాలు, లైంగిక వేదింపులు, అక్రమ రవాణాల పైన అవగాహన కార్యక్రమాలు సిపిఓ రాజ్యలక్ష్మి శనివారం చేపట్టడం జరిగింది. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ బాల్య వివాహం చేయడం నేరం అందుకు సహకరించిన కేసులు పెట్టి లక్ష రూపాయలు జరిమానాతో పాటు 2 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుందని వివరించారు.