రాయవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధి లోని సొంట్టవారి పల్లిలో టిబి ముక్తా అభియాన్ ప్రోగ్రాం లో భాగంగా అవాగాహన కార్యక్రమం డాక్టర్ శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. టీ బి వ్యాధి గురుంచి అవగాహన కల్పిస్తూ రెండు వారల దగ్గు, సాయంకాలం జ్వరం, ఛాతిలో నొప్పి, ఆకలి మందగించడం, దగ్గినపుడు గళ్ళ తో పాటు రక్తం పడ్డటం ఈ లక్షణాలు ఉన్నవాళ్లు పరీక్ష చేయించుకొని ఉచితంగా మందుల పొందవచ్చునని అన్నారు.