సుండుపల్లి మండలం రెడ్డివారిపల్లి గ్రామ పంచాయతీ కోణంకివారిపల్లి నాగారపమ్మ గుడి దగ్గర బుధవారం బోరు వేసి గ్రామాలకు తాగు నీరు అందించే కార్యక్రమాన్ని రాజంపేట పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు చమర్తి జగన్ మోహన్ రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా చూడాలని ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం తరపున బోర్లను వేయిస్తున్నామని తెలిపారు.