సుండుపల్లి: విద్యుత్ ఘాతానికి గురై ఆవు మృతి

85చూసినవారు
సుండుపల్లి మండలం పెద్దినేని కాలువ గ్రామం బుడిదేటి వాండ్లపల్లి లో ఆదివారం ఉదయం 9 నెలలు గర్భంతో ఉన్న జెర్సీ ఆవు విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందింది. ఎలక్ట్రిసిటీ అధికారుల నిర్లక్ష్యంతో ఇలా జరిగిందని శివయ్య అనే రైతు ఆవేదన వ్యక్తం చేశారు. రైతు వెంటనే గ్రామస్తులకు తెలపగా వారు వచ్చి చూసేసరికి అప్పటికే మృతి చెందిందని తెలిపారు. విద్యుత్ శాఖ సంబంధిత అధికారుల పై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్