రెండవ అయోధ్యగా పేరుగాంచిన ఒంటిమిట్ట కోదండ రామాలయంలో జూలై 21న స్వామివారి పౌర్ణమి కళ్యాణం నిర్వహించడం జరుగుతుందని టిటిడి అధికారులు బుధవారం వెల్లడించారు. రూ 1000 ఆన్లైన్ ద్వారా గాని, నేరుగా ఆలయంలో గాని సమర్పించి కళ్యాణంలో ఉభయదారులుగా వ్యవహరించవచ్చునని వారు తెలిపారు. జులై 21న వ్యాస పౌర్ణమి కూడా ఉందని తెలిపారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.