రాజంపేట నియోజకవర్గంలో గ్రామాలు అభివృద్ధే తన లక్ష్యమని, ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం టిడిపి అధ్యక్షులు చమర్తి జగన్మోహన్ రాజు అన్నారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరం కలిసికట్టుగా పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.