రాజంపేట నియోజకవర్గంలోని ఒంటిమిట్ట మండలం ముకుంద ఆశ్రమం ప్రాథమిక పాఠశాలను శనివారం ఎంఈఓ ప్రభాకర్ రావు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. పాఠశాలలోని రికార్డులను పరిశీలించారు. విద్యార్థుల చతుర్విధ ప్రక్రియలను పరిశీలించారు. విద్యార్థుల వర్క్ పుస్తకాలను పరిశీలించి విద్యార్థులకు తగిన సూచనలు సలహాలు అందజేశారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన ఉపాధ్యాయులకు సూచించారు.