రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట హరిజన వాడ ప్రాథమిక పాఠశాలలో గురువారం మండల విద్యాశాఖ అధికారి ప్రభాకర్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. పాఠశాలలోని రికార్డులను పరిశీలించి ఉపాధ్యాయులకు తగిన సూచనలు, సలహాలు అందజేశారు. విద్యార్థులకు నిర్వహించిన ఎఫ్ఏ1, ఎఫ్ఏ2 పరీక్షలలో విద్యార్థులు సాధించిన మార్కులను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు.