అమరవీరుల త్యాగబలం స్వాతంత్రం అని సిద్ధవటం మండలం పెద్దపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ తుర్రా చిన్నక్క అన్నారు. ఆమె గ్రామ సచివాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించారు. స్వాతంత్ర సంపాదించడానికి కష్టపడిన స్వాతంత్ర సమరయోధుల వీరగాథలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.