ఇప్పటివరకు రాజంపేటలో ఆగని ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలు బుధవారం మొదటిసారిగా ఆగింది. తిరుపతి నుంచి ఢిల్లీకి వెళ్లే ఈ రైలు 2005 మార్చి 21న ప్రారంభమైంది. కడప మీదుగా ప్రయాణించినా, రాజంపేటలో ఆగకపోవడం వల్ల దూర ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఆగడంతో రాజంపేట ప్రజల దీర్ఘకాల స్వప్నం నెరవేరింది. ఈ రైలును మంత్రి మండిపల్లి ప్రారంభించారు.