ఒరిగిన సూచిక బోర్డులు.. పట్టించుకోని అధికారులు

85చూసినవారు
ఒరిగిన సూచిక బోర్డులు.. పట్టించుకోని అధికారులు
రాజంపేట బైపాస్ రహదారిలో ఎన్టీఆర్ విగ్రహం సమీపంలో జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన సూచిక బోర్డులు ఇటీవల వీచిన పెనుగాలులకు విరిగి స్తంభానికి వేలాడుతూ ప్రమాదకరంగా మారాయి. ఈ విషయాన్ని రాజంపేట ఆర్ అండ్ బి అధికారుల దృష్టికి స్థానికులు తీసుకెళ్లినప్పటికీ తమకు సంబంధం లేదని పట్టి పట్టినట్లుగా వ్యవహరిస్తున్నారని శనివారం రాజంపేట వాసులు, ప్రయాణికులు వాపోతున్నారు. అధికారులు స్పందించి సూచిక బోర్డులు తొలగించాలన్నారు.

సంబంధిత పోస్ట్