సిద్ధవటం మండలం పెద్దపల్లి గ్రామపంచాయతీ బాకరాపేట లో ఆదివారం నడివీధి గంగమ్మ జాతరను వైభవంగా నిర్వహించనున్నట్లు శనివారం నిర్వాహకులు తెలిపారు. బస్సుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వారివారు తెలిపారు. ప్రతి ఒక్కరూ పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని వారు కోరారు. కోరిన కోరికలు తీర్చే తల్లి బాకరాపేట నడి వీధినడివీధి గంగమ్మ దేవత అని వారు తెలిపారు.