కర్నూలు రేంజ్ డీఐజీ ప్రవీణ్ సూచనల మేరకు ఫోరెన్సిక్ సైన్స్ ఎవిడెన్స్ మేనేజ్మెంట్ పై శిక్షణా కార్యక్రమం అన్నమయ్య జిల్లా ఎస్పి విద్యాసాగర్ నాయుడు ఆధ్వర్యంలో జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలోని సమావేశo ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ నేరం చేసిన వ్యక్తి శిక్ష నుండి తప్పించుకోకుండా నేర స్థలంలో సాక్ష్యాధారాల సేకరణ, వాటి భద్రత ప్రమాణాలు ఎలా పాటించాలి అనే విషయాల పై ప్రత్యేక శ్రద్ధ ఉంచాలని తెలియజేశారు.