శ్రీరామ ఎత్తిపోతల పథకం ద్వారా ఒంటిమిట్ట చెరువుకు కోటపాడు నుండి సోమశిల వెనుక జలాలను విడుదల చేసే కార్యక్రమాన్ని మంగళవారం అధికారులు నిర్వహించారు. గతంలో అనేకసార్లు యంత్రాలకు మరమ్మతుల కారణంగా ఒంటిమిట్ట చెరువుకు నీరు సరఫరా చేయడం ఆగిపోయాయి. అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టడంతో మంగళవారం మరల ఒంటిమిట్ట చెరువుకు నీళ్లు తరలించడం జరిగింది. మండల రైతులు సంతోషంగా వ్యక్తం చేశారు.