వీరబల్లి మండలం మట్లి గ్రామం బత్తిన వాండ్లపల్లిలో భర్త కావాలంటూ అత్తవారి ఇంటి ముందు కుటుంబ సభ్యులతో కలిసి భార్య సౌజన్య బైఠాయించిన ఘటన ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. బాధితురాలు వివరాల మేరకు. ఎనిమిదేళ్లు ప్రేమించుకుని హైదరాబాద్ లో రెండేళ్ల క్రితం మాడితాటి మహేశ్వర రెడ్డిని వివాహం చేసుకున్నానని సౌజన్య తెలిపింది. నా భర్త వరకట్నం తేవాలంటూ వేధింపులకు గురి చేస్తున్నట్లు సౌజన్య ఆవేదన వ్యక్తం చేసింది.