వీరబల్లి: రైతుల సమస్యలపై వైఎస్ షర్మిలకు వినతి

60చూసినవారు
వీరబల్లి: రైతుల సమస్యలపై వైఎస్ షర్మిలకు వినతి
రాజంపేట నియోజకవర్గంలోని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు వీఆర్డీఎస్ సురేంద్రారెడ్డి రాయచోటి పీసీఆర్ ఫంక్షన్ హాల్లో మంగళవారం జరిగిన కార్యకర్తల సమావేశంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయర మాట్లాడుతూ రాజంపేట నియోజకవర్గ వ్యాప్తంగా గత ఐదేళ్లుగా మామిడి, అరటి పంటలు సరిగ్గా పండక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం నుంచి రైతులకు ఎలాంటి సహాయం అందలేదని తెలిపారు.

సంబంధిత పోస్ట్