రాష్ట్రంలో కష్టాల్లో ఉన్న పసుపు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎన్. తులసి రెడ్డి అన్నారు బుధవారం ఒంటిమిట్ట మండలం పసుపు రైతులతో ఆయన మాట్లాడి పసుపు పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పసుపు పంట పండించిన రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. ఎకరాకు దాదాపు రూ. 2 లక్షల ఖర్చు అయిందని, ఎకరాకు రూ 50 వేలు రైతులు నష్టపోయారని అన్నారు.