రాజంపేట నియోజకవర్గంలోని అన్ని సమస్యలను పరిష్కరించడమే కాకుండా అభివృద్ధికి సహకరిస్తామని, కలిసికట్టుగా పనిచేసే 2029 ఎన్నికలలో రాజంపేటలో టిడిపి జెండా ఎగురవేసేలా కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు రాజంపేట టిడిపి నాయకులకు సూచించారు. శనివారం ఒంటిమిట్టలో రాజంపేట పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో ముఖ్య నాయకులు కలిశారు. ముఖ్యమంత్రి రాజంపేట లోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు.