యువత లక్ష్య సాధన దిశగా ముందుకు సాగాలని రాజంపేట సబ్ కలెక్టర్ నిధియా దేవి అన్నారు. శనివారం రాజంపేట ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. యువత లక్ష్యసాధన దిశగా చిత్తశుద్ధితో కష్టపడి పని చేస్తే ఎంతటి కష్టతరమైన పని కూడా విజయవంతం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్కిల్ డెవలప్ మెంట్ శాఖ అధికారులు పాల్గొన్నారు.